కొంటూర్‌లో సర్పంచ్ మామిడి యాదగిరి గౌడ్‌కు ఘన సన్మానం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం.
మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా.డిసెంబర్22మెదక్ జిల్లా మెదక్ మండలంలోని కొంటూర్ గ్రామంలో కొంటూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మామిడి యాదగిరి గౌడ్ గారికి శాలువాలతో ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ మామిడి యాదగిరి గౌడ్ చేస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా గ్రామ సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బోమ్మర్ది స్వాతి పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు బోమ్మర్ది అమృత, నిరుడి సందీప్, ఎడమలపల్లి...