manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 9:28 am Editor : Mana Praja Prathinidhi

ఝాన్సీ లింగాపూర్ గ్రామ అభివృద్ధికి అండగా సర్పంచ్ మానేగల రామకృష్ణయ్య

మెదక్ జిల్లా,రామాయంపేటమండలం.డిసెంబర్24ఝాన్సీలింగాపూర్ గ్రామంలో ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్పంచ్ మానేగల రామకృష్ణయ్య గ్రామ ప్రజలకు నిజమైన అండగా నిలుస్తున్నారు.ప్రతి విషయంలో గ్రామాభివృద్ధినే కేంద్రంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటున్నారు.సర్పంచ్ రామకృష్ణయ్యకు కుడిచేయిలా నిలుస్తూ వరుణ్ కుమార్ ఆయుర్వేదిక్ విభాగంలో పనిచేస్తూ, ఏ చిన్న పని అయినా బాపు బాటలో నడిపిస్తూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నారు. “బాపు… నేను ఉన్నాను” అంటూ ధైర్యం చెప్పి ప్రతి పనిని బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నారు.ప్రజల విశ్వాసాన్ని బలంగా సంపాదించుకున్న మానేగల రామకృష్ణయ్య, గ్రామంలో మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు వేగంగా అమలు చేయడంలో ముందున్నారు. సమస్య వచ్చిన చోటే పరిష్కారం చూపుతూ, గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నాయకుడిగా మంచి గుర్తింపు పొందుతున్నారు.ఝాన్సీ లింగాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సర్పంచ్ మానేగల రామకృష్ణయ్య తన బృందంతో కలిసి నిరంతరం కృషి చేస్తుండటం గ్రామ ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతోంది.