గొర్రెలు–మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమందుద్దెడ గ్రామంలో ప్రారంభించిన సర్పంచ్ మిద్దె శివకుమార్
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్24ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఉచిత నట్టల నివారణ కార్యక్రమం దుద్దెడ గ్రామంలో విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్, ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరి లు అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమాన్ని పశు వైద్యాధికారి శ్రీనివాస్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా గొర్రెల కాపరులతో మాట్లాడిన పశు వైద్యాధికారి శ్రీనివాస్,నట్టల నివారణ జరిగితే గొర్రెలు, మేకల్లో ఆకలి గుణం పెరిగి బాగా మేత తీసుకుంటాయని, ఆరోగ్యంగా పెరిగి అధిక బరువు సాధిస్తాయని తెలిపారు. అలాగే...