manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 December 2025, 12:58 pm Editor : Mana Praja Prathinidhi

ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు భూంపల్లి వాసుల ఘన స్వాగతం

భూంపల్లిలో సామాజిక ఐక్యతకు నిదర్శనంగా బక్కి వెంకటయ్య సన్మానం
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లా.అక్బర్‌పేట–భూంపల్లిమండలండిసెంబర్ 20
అక్బర్‌పేట–భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని భూంపల్లి గ్రామ ముస్లిం కులస్తులు ఆధ్వర్యంలో నిర్వహించి శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన భూంపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను కూడా శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ అభివృద్ధి, సామాజిక ఐక్యత, ప్రజాసేవ దిశగా ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ముస్లిం కులస్తులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.