manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 December 2025, 5:40 pm Posted by : Mana Praja Prathinidhi

సూరారం గ్రామంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

సదాశివపేట,డిసెంబర్17(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట మండలంలోని సూరారం గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. గ్రామ చర్చిలో యేసు క్రీస్తు జీవిత చరిత్రను ప్రతిబింబించే నాటకాలు, డాన్స్ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాస్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు హాజరై వేడుకలకు మద్దతు తెలిపారు. అనంతరం కేక్ కటింగ్, సంగీత కార్యక్రమాలు నిర్వహించి యేసు క్రీస్తు జననాన్ని ముందుగానే ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.సెమీ క్రిస్మస్ వేడుకలు గ్రామంలో క్రిస్మస్ పండుగకు ముందస్తు ఉత్సాహాన్ని నింపుతూ, ఐక్యతను మరింత బలోపేతం చేశాయని గ్రామస్తులు పేర్కొన్నారు.