•స్పార్క్ అకాడమీ విద్యార్థుల విజృంభణ… కుంగ్‌ఫూ, కరాటేలో స్వర్ణ–రజత పతకాల వరద.
•కుంగ్‌ఫూ–కరాటే పోటీల్లో స్పార్క్ అకాడమీ విద్యార్థుల ప్రభంజనం
వరంగల్‌లో నిర్వహించిన పోటీల్లో ఆరుగురు విద్యార్థులు ఏడు పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని పెంచారు.
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్22
రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు వరంగల్‌లో ఆదివారం నిర్వహించిన కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో ప్రతిభ చాటి ఏడు పతకాలు సాధించారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన స్పార్క్ కుంగ్‌ఫూ అకాడమీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారు.పోటీల్లో కంచర్ల శ్రీనిక, లింగం శ్లోక, గజ్జెల శేదిక, ఎల్లె ప్రణవి, కోడం చైతన్య బంగారు పతకాలు గెలుచుకోగా, మసరకంటి శాన్విక, ఎల్లె ప్రణవి వెండి పతకాలు సాధించారు. విద్యార్థుల ప్రతిభను పలువురు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో అకాడమీ మాస్టర్ సంతోష్, వొడ్నాల అన్నపూర్ణ, ఎం.ఏ. హమీద్, సయ్యద్ యాకూబ్, కోటేశ్వర్, వొడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.విద్యార్థుల విజయం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ చూపేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.