manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 9:42 am Posted by : Mana Praja Prathinidhi

ఘనంగాసోనియాగాంధీజన్మదినవేడుకలు   

మనప్రజాప్రతినిధి/శ్రీకాళహస్తినియోజకవర్గం,డిసెంబర్9 మాజీ ఏఐసీసీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ గారి 79వ జన్మదినాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం, రేణిగుంట మండలం, గురవరాజుపల్లి ఎస్టీ కాలనీలో కేక్ కట్ చేసి, పిల్లలతో కలిసి స్వీట్లు పంపిణీ చేస్తూ ఆనందోత్సాహాల నడుమ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ“పేదల కోసం ప్రాణాలు అర్పించే, ప్రజల కోసమేజీవించే ఏకైక కుటుంబం గాంధీ కుటుంబం. ప్రజలతో మమేకమై, వారి సమ స్యల కోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి బ్రిటిష్ వారి పాలన నుండి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన చారిత్రిక పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్, ఏర్పేడు మండల నాయకులు గోపాలరావు, యువజన అధ్యక్షులు నవీన్, నాగరాజు, మహేష్, సాయి, సారధి, బాబు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.