manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 3:43 pm Posted by : Mana Praja Prathinidhi

తిరుపతి అభివృద్ధికి వేగం-మాస్టర్ ప్లాన్ రోడ్డుకుభూములసర్వేచేపట్టినతుడాచైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లాడిసెంబర్10
తిరుపతి నగర భవిష్యత్తు అభివృద్ధికి, రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే ట్రాఫిక్ అవసరాలకు ముందస్తు ఏర్పాట్లుగా మహత్తర మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన భూములను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు ప్రత్యక్షంగా పరిశీలించారు.
తిరుపతి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైపు అడుగులు
రోజురోజుకి పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు, తిరుపతిని చుట్టుముట్టే ప్రాధాన్య రహదారులను కొత్తగా రూపుదిద్దే మాస్టర్ ప్లాన్ అమలు కోసం తుడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఈ భాగంగా చైర్మన్ స్వయంగా సిబ్బందితో కలిసి ఫీల్డ్‌లో పరిశీలన చేయటం విశేషం.
ఐదు మండలాలను అనుసంధానించే భారీ రోడ్ ప్రాజెక్ట్
మాస్టర్ ప్లాన్ రోడ్ తిరుపతిని పరిసర ప్రాంతాలతో అనుసంధానించి అభివృద్ధికి కొత్త దిశ చూపనుందని అధికారులు తెలిపారు.
తిరుపతిరూరల్.చంద్రగిరి.ఆర్.సి.పురం.రేణిగుంట. వడమాలపేట. మండలాలనుకలుపుతూవ్యూహాత్మకంగారూపొందించబడుతున్నది. సర్వేలో పాల్గొన్న అధికారులు పరిశీలన కార్యక్రమంలో తుడా సెక్రటరీ, ఈ ఈ, యస్ ఈ,ప్లానింగ్ అధికారి,తుడా సాంకేతిక బృందం పాల్గొన్నారు.