సదాశివపేట,డిసెంబర్28(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణంలోని స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో అమెరికా తెలుగు సంఘం మాట సేవ డేస్ ఆధ్వర్యంలో, శ్రీ అయ్యప్ప సేవాసమితి మరియు ఆద్య హాస్పిటల్ వారి సహకారంతో మెగా హెల్త్ క్యాంప్‌ను విజయవంతంగా నిర్వహించారు.ఈ హెల్త్ క్యాంప్‌లో సుమారు 650 మంది ప్రజలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆద్య హాస్పిటల్‌కు చెందిన వైద్యుల బృందం సుమారు 30 మంది సిబ్బందితో పాల్గొని రోగులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి సేవలందించారు.ఈ కార్యక్రమంలో మాట అధ్యక్షులు రమణ కిరణ్ దుద్గగి, మాట సభ్యులు డాక్టర్ విజయభాస్కర్ బొలగం, శ్రీధర్ గుడాల, గోపి ఉట్కూరి, అలాగే శ్రీ అయ్యప్ప సేవాసమితి అధ్యక్షులు గోనే శంకర్, ఉపాధ్యక్షులు సుధాకర్ ఆర్‌ఐ, సభ్యులు ఓదెల రవీందర్, అమ్రాది రాచన్న, చెన్నాకర్ పాల్గొన్నారు. ఆద్య హాస్పిటల్ సంస్థ ఎండి డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్, చింత గోపాల్, డాకురి అశోక్ హాజరై కార్యక్రమాన్ని అభినందించారు.ఈ సందర్భంగా మాట అధ్యక్షులు రమణ కిరణ్ దుద్గగి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 10 పట్టణాల్లో మాట సేవా డేస్ కార్యక్రమాలు నిర్వహించామని, జనవరి 9న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నట్లు తెలిపారు. శాసనసభ్యులు చింత ప్రభాకర్ మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షిస్తూ తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి మాట సలహా మండలి సభ్యులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామాల, జితేందర్ రెడ్డి అమెరికాలో ఉండి కూడా ప్రోత్సాహం అందించడం విశేషంగా నిలిచింది.