శ్రీకాళహస్తిట్రైబల్ బాలికలకాలేజీలోఆత్మీయసమావేశం3.0నిర్వహణ

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 5ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి ట్రైబల్ బాలికల సంక్షేమ పాఠశాల–కళాశాలలో ప్రిన్సిపల్ లలిత ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం 3.0 కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్, హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ రవికుమార్, శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్‌–ఇన్స్పెక్టర్ హరిత ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ప్రారంభంలో ప్రిన్సిపల్, సిబ్బంది అతిథులను పుష్పగుచ్ఛాలతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ప్రిన్సిపల్ లలిత మాట్లాడుతూ,“విద్యార్థులు – తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ బంధాన్ని పటిష్టం...