manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 12:36 am Editor : Mana Praja Prathinidhi

నూతన సంవత్సర వేడుకల్లో చట్టం అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

అక్బర్‌పేట్ భూంపల్లి ఎస్‌ఐ హరీష్ గౌడ్ హెచ్చరిక
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండల్,సిద్దిపేట జిల్లా. డిసెంబర్31
అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలో నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, హుందాగా జరుపుకోవాలని మండల ఎస్‌ఐ హరీష్ గౌడ్ యువతకు సూచించారు. నూతన సంవత్సరం సందర్భం గా చట్టాన్ని అతిక్రమిస్తూ బరీతెగింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.న్యూ ఇయర్ వేడుకల పేరుతో రోడ్లపై డ్యాన్సులు చేయడం, మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, న్యూసెన్స్ చేయడం వంటి చిల్లర చర్యలకు తావివ్వకూడదని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి మండలంలోని కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి, విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిఘా పెంచనున్నట్లు తెలిపారు.వీధుల్లో కేకులు కట్ చేయడం, డీజేలు ఏర్పాటు చేసి హంగామా చేయడం నిషేధమని స్పష్టం చేశారు. సైలెన్సర్ తీసివేసి వాహనాలు నడిపినప్పటికీ, రాష్ డ్రైవింగ్ చేసినప్పటికీ సంబంధిత బైక్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు.అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత అనవసరంగా రోడ్లపై తిరగరాదని, పోలీస్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సౌండ్ పొల్యూషన్‌కు సంబంధించిన నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, భద్రతగా జరుపుకొని పోలీసు శాఖకు సహకరించాలని ఎస్‌ఐ హరీష్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.