శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తేకఠినచర్యలుతప్పవుజిల్లాఎస్పీమహేష్ బి.గితే,ఐపీఎస్

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్ 07రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిగా స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టింది. ప్రతి ఓటరు ఎలాంటి భయం లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునేలా గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.ఎన్నికల నియమావళిపై ప్రజల్లో చైతన్యం పెంచుతూ, పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యం లేదా విలువైన వస్తువులు పంపిణీ...