రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో విద్యార్థిని కావ్యకు డబుల్ గోల్డ్

అభినందించిన జీజేసీ ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డిసిద్దిపేట నియోజకవర్గం. మనప్రజాప్రతినిధి//డిసెంబర్ :ఒక నాణానికి బొమ్మ, బొరుసు ఎంత ముఖ్యమో… విద్యార్థిజీవితంలో చదువు, క్రీడలు కూడా అంతే ముఖ్యమని సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో–ఎడ్యుకేషన్) ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి అన్నారు.ఎస్‌జీఎఫ్ అండర్–19 విభాగంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో ట్రాక్ ఈవెంట్, రోడ్ ఈవెంట్‌లలో రెండు బంగారు పతకాలు సాధించిన కళాశాల విద్యార్థిని బరిగే కావ్యను బుధవారం కళాశాలలో ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ…రెండు విభాగాల్లోనూ స్వర్ణ పతకాలు సాధించి కావ్య కళాశాలకే కాకుండా...