manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 December 2025, 10:39 am Editor : Mana Praja Prathinidhi

అల్లాదుర్గంలో అనుమానాస్పద మృతి ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మనప్రజాప్రతినిధి//మెదక్ రిపోర్టర్.డిసెంబర్18
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
స్థానికుల కథనం ప్రకారం, మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామ శివారులోని పావురాల గుట్ట సమీపంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఉన్నట్లు గమనించిన రైతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న ఏఎస్ఐ గాలయ్య తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడిని ముస్లాపూర్ గ్రామానికి చెందిన ఉప్పరి శేఖర్ గా గుర్తించారు.ఇటీవల జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని తన స్వగ్రామానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.