ఈబడిని పట్టించుకోండి… న్యాయం జరిగే తీరు-తల్లిదండ్రుల ఆవేదన

మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.సెంబర్18తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పల్లం గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థుల భద్రత, ఆరోగ్యాలపై తీవ్ర ఆందోళన నెలకొంది. స్కూల్ బిల్డింగ్‌కు తలుపులు, కిటికీలు, ప్లాస్టరింగ్ వంటి మౌలిక పనులు ఇప్పటికీ చేయకపోవడంతో భవనం నిరుపయోగంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు.మునుపటి హెచ్ఎం రామాంజనేయులు పర్యవేక్షణలో స్కూల్ భవన నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, మంజూరైన నిధులు సరిపోలలేదన్న కారణంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఆ భవనం కొంతమంది గ్రామవాసుల సొంత కార్యకలాపాలకు ఉపయోగపడుతున్న పరిస్థితి...