manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 12:30 pm Posted by : Mana Praja Prathinidhi

శ్రీ పరశురామేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ రామకృష్ణారెడ్డి

ఆలయ మహిమకు ఆకర్షితులవుతున్న ప్రముఖులు
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్29
ఎర్పేడు మండలంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో పాటు ప్రముఖుల దర్శనాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణారెడ్డి సోమవారం స్వామివారి దర్శనార్థంఆలయానికి విచ్చేశారు.ఆలయానికి వచ్చిన జస్టిస్ రామకృష్ణారెడ్డికి ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు కార్యనిర్వాహణాధికారి ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదం కల్పించారు.ఈ సందర్భంగా ఆలయ చరిత్ర, స్వామివారి మహిమ, ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, ఉత్సవాల వివరాలను జడ్జికి వివరించారు.ఇటీవలే జిల్లాకు చెందిన కలెక్టర్ కుటుంబ సభ్యులు సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం విశేషం. శ్రీ పరశురామేశ్వర స్వామి అనుగ్రహంతో భక్తుల కోరికలు నెరవేరుతున్నాయన్న నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
పురాతన చరిత్ర, ఆధ్యాత్మిక ప్రశాంతతతో కూడిన ఈ దేవస్థానం రోజురోజుకీ భక్తుల విశేష ఆదరణ పొందుతూ, జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది.