manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 3:34 pm Editor : Mana Praja Prathinidhi

ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం

దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు.

పేదలు, బడుగు, బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.

మనప్రజాప్రతినిధి//మనకొండూరు,డిసెంబర్28
ఇల్లంతకుంట మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, పేదలు, బడుగు, బలహీన వర్గాలకు ఎప్పటికప్పుడు అండగా నిలబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దేశంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీనేనని, దేశానికి దిశా నిర్దేశం చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిందని కొనియాడారు.ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధానాలపై దృష్టి పెట్టకుండా పథకాల పేర్లు మారుస్తూ కాలం వృథా చేస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ‘గాంధీ’ అనే పదాన్ని తొలగించే ప్రయత్నం చేయడం సరికాదని సూచించారు. పథకాల పేర్లు మార్చడం కంటే పని దినాలు పెంచి పేదలు, బడుగు బలహీన వర్గాలకు మరింత ఉపయోగకరంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ కోఆర్డినేటర్, రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పుష్పలత, మానకొండూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రసాద్, సర్పంచులు మామిడి రాజు, కతా మల్లేశం, నవీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజేశం, వెంకట్ రెడ్డి, సత్యలక్ష్మి, వీరేశం, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నరేష్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు జమాల్‌తో పాటు సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.