manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 15 December 2025, 9:25 am Editor : Mana Praja Prathinidhi

శ్రీకాళహస్తిలో కూటమి శ్రేణుల ఘన స్వాగతం

ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గురవారెడ్డి తొలి పర్యటన
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్ 15
ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి శ్రీకాళహస్తి పట్టణానికి ఆదివారం తొలిసారిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు ఏపీ సీడ్స్ కూడలి వద్ద ఘన స్వాగతం పలికారు.పార్టీ నాయకులు గురవారెడ్డిని గజ పూలమాలలు, శాలువాలు, పూల కిరీటాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించడంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను గురవారెడ్డి చేత కట్ చేయించి ఆనందం వ్యక్తం చేశారు.అనంతరం ఆయన నాయకులతో కలిసి పట్టణంలోని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గురవారెడ్డి మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పలు బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. యువత కమిటీల నుంచి ఉమ్మడి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పలు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులుగా సేవలందించిన అనుభవాన్ని గుర్తు చేశారు.తనపై విశ్వాసం ఉంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలకు కృతజ్ఞత లు తెలిపారు. ఈ నియామకానికి సహకరించిన జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జోన్–4 పరిశీలకులు ఎమ్మెల్సీ శ్రీరాం గోపాల్ రెడ్డి, శ్రీ దీపక్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గ్రంథాలయ వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, డిజిటల్ గ్రంథాలయాలను బలోపేతం చేసి పాఠకులకు మరింత చేరువ చేసే విధంగా పనిచేస్తామని గురవారెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, సీనియర్ నాయకులు గాలి మురళి నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ పేట బాలాజీ రెడ్డి, డి. నాగేశ్వరరావు, కందాటి మహేష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాఘవల యాదవ్, దొరై రాజు రెడ్డి, మునయ్య, శివశంకర్ రెడ్డి, మురళి, మునిరాజా యాదవ్, ఎమ్మెస్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు ప్రత్యేకంగా సత్కరించారు.