శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
•పూజలో పాల్గొన్న ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డిసదాశివపేట,డిసెంబర్26(మనప్రజాప్రతినిధి):సదాశివపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో కేశవ్ గురు స్వామి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముత్తంగి నర్సింగ్‌రావు భజన మండలి ఆలపించిన భక్తిగీతాలతో ఆలయ ప్రాంగణం భక్తి పరవశంతో నిండిపోయింది. ఈమహోత్సవంలో అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు వేలాదిగా పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు...