మనప్రజాప్రతినిధి//మనకొండూరు,డిసెంబర్23
మనకొండూరు మండలం ముస్కాన్ పేట గ్రామంలో ఉపసర్పంచ్ దాసరి లావణ్య–శ్రీనివాస్‌తో పాటు వార్డు సభ్యులు ఇట్టి రెడ్డి లక్ష్మారెడ్డి, సార రమ–శంకర్, ఎలుక రేణుక–కనుకయ్యలను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు ప్రజలతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామ సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు పినికాశి అనిల్, బూత్ అధ్యక్షులు శిరవేణి అంజి, సారా రాజు, తుమ్మనపల్లి కమలాకర్ రావు, బీజేపీ కార్యకర్తలు ఎల్లయ్య, శ్రీనివాస్, నరసయ్య, రాజయ్య, మల్లయ్య, పరశురాం, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.