manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 8:21 am Editor : Mana Praja Prathinidhi

పోతారెడ్డిపేటలోసర్పంచ్ అభ్యర్థి కాకి కొండల్ ప్రచారం వేగం

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్.డిసెంబర్12 భూంపల్లిమండలం,దుబ్బాకనియోజకవర్గం,సిద్దిపేట జిల్లా

పోతారెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న కాకి కొండల్ శుక్రవారం ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల చిహ్నంగా కేటాయించిన ఉంగరం గుర్తును ఓటేసి గెలిపించండి అంటూ ప్రజలకు వివరించారు.గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన, పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, వాటిని పూర్తిచేయడానికి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేస్తానని తెలిపారు. గ్రామ యువజన సంఘాలు, మహిళా సంఘాలు, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళతానని పేర్కొన్నారు.
గ్రామంలో వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యమని కాకి కొండల్ చెప్పారు. రైతులకు ధాన్యం ఆరబెట్టే స్థల ఏర్పాటు, మినీ ఫంక్షన్ హాల్, మినీ స్టేడియం, అంగన్వాడి కేంద్రాలు, గ్రంథాలయం, చిల్డ్రన్ పార్క్ వంటి సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు.అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు పూర్తిచేసే ప్రయత్నం చేస్తానని వివరించారు. గత ఎన్నికల్లో స్వల్పంగా ఓటమి చెందినప్పటికీ గ్రామ ప్రజల సంక్షేమాన్ని మాత్రం విస్మరించలేదని భావోద్వేగంగా తెలిపారు.గ్రామ అభివృద్ధి పట్ల త‌న కంకణాన్ని ప్రజలకు తెలియజేస్తూ కాకి కొండల్ ఇళ్లలో ప్రచారాన్ని కొనసాగించారు.