పోతారెడ్డిపేటలోసర్పంచ్ అభ్యర్థి కాకి కొండల్ ప్రచారం వేగం
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్.డిసెంబర్12 భూంపల్లిమండలం,దుబ్బాకనియోజకవర్గం,సిద్దిపేట జిల్లాపోతారెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న కాకి కొండల్ శుక్రవారం ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల చిహ్నంగా కేటాయించిన ఉంగరం గుర్తును ఓటేసి గెలిపించండి అంటూ ప్రజలకు వివరించారు.గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన, పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, వాటిని పూర్తిచేయడానికి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేస్తానని తెలిపారు. గ్రామ యువజన సంఘాలు, మహిళా సంఘాలు, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళతానని పేర్కొన్నారు.గ్రామంలో వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యమని కాకి కొండల్ చెప్పారు....