సదాశివపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్… పార్టీ ఆఫీసులో కీలక సమీక్ష సమావేశం
సదాశిపేట.డిసెంబర్21(మనప్రజాప్రతినిధి)సదాశివపేట పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా సదాశిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ గౌడ్ హాజరై దిశానిర్దేశం చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సదాశివపేట పట్టణంలోని 26 వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.18 కోట్ల 40 లక్షల విలువైన సీసీ...