manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 4:07 am Editor : Mana Praja Prathinidhi

భక్తుల సౌకర్యమే ధ్యేయం: ట్రాఫిక్ ఫ్రీ శ్రీకాళహస్తికి బొజ్జల బ్లూప్రింట్.

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి.డిసెంబర్27
రానున్న మహాశివరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని శ్రీకాళహస్తి పట్టణ రూపురేఖలను మార్చే దిశగా ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల సౌకర్యమే ధ్యేయంగా ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే అభివృద్ధి బ్లూప్రింట్‌ను ఆయన ప్రకటించారు.మహాశివరాత్రి నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టణంలో రోడ్ల విస్తరణ, అత్యాధునిక ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నిత్యం వేలాదిమంది భక్తులు తరలివచ్చే శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ రద్దీని పూర్తిగా నియంత్రించడమే లక్ష్యమన్నారు.“త్వరలో ట్రాఫిక్ లేని శ్రీకాళహస్తిని ప్రజలు చూస్తారు” అని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, పట్టణాభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.రోడ్ల విస్తరణ, ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, అందరి సహకారంతోనే అభివృద్ధి చెందిన, శుభ్రమైన, భక్తులకు సౌకర్యవంతమైన శ్రీకాళహస్తిని నిర్మించగలమని తెలిపారు.శ్రీకాళహస్తిని ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన బలమైన సంకల్పమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.