భక్తుల సౌకర్యమే ధ్యేయం: ట్రాఫిక్ ఫ్రీ శ్రీకాళహస్తికి బొజ్జల బ్లూప్రింట్.
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి.డిసెంబర్27రానున్న మహాశివరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని శ్రీకాళహస్తి పట్టణ రూపురేఖలను మార్చే దిశగా ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల సౌకర్యమే ధ్యేయంగా ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే అభివృద్ధి బ్లూప్రింట్‌ను ఆయన ప్రకటించారు.మహాశివరాత్రి నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టణంలో రోడ్ల విస్తరణ, అత్యాధునిక ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నిత్యం వేలాదిమంది భక్తులు తరలివచ్చే శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ రద్దీని పూర్తిగా నియంత్రించడమే లక్ష్యమన్నారు.“త్వరలో ట్రాఫిక్ లేని శ్రీకాళహస్తిని...