manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 3:11 pm Editor : Mana Praja Prathinidhi

సర్పంచ్–పశువైద్యాధికారి ఆధ్వర్యంలో నట్టల నివారణ కార్యక్రమం

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్29
రాంపల్లి గ్రామంలో సోమవారం రోజు గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లయ్య, ఉప సర్పంచ్ అత్కరి మాధవి–సుధాకర్, పశువైద్యాధికారి శ్రీనివాస్లతో కలిసి జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బొమ్మ మల్లయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రతి సంవత్సరం గొర్రెలు, మేకలు వంటి జీవాలకు నట్టల నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈ మందుల వలన జీవాలు నులిపురుగుల బారిన పడకుండా ఉండటంతో పాటు, పోషకాలను సక్రమంగా గ్రహించి బరువు పెరిగి వేగంగా వృద్ధి చెందుతాయని చెప్పారు. అంతేకాకుండా జీవాల మరణాల రేటు తగ్గి, చివరికి జీవాల పెంపకందారుల ఆదాయం పెరుగుతుందని వివరించారు.రైతులు తమ జీవాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పశువైద్యాధికారి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మీసా కిష్టవ్వ, బొమ్మ స్వామి, అత్కూరి వైకుంటం, వుడేం మహిపాల్ రెడ్డి, కొంతం శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.