తిరుపతి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్31నూతన సంవత్సరం–2026 సందర్భంగా తిరుపతి జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ బాధ్యతాయుతంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ఆంక్షలు మరియు కఠిన భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.డిసెంబర్ 31 రాత్రి మరియు జనవరి 1 తేదీల్లో జిల్లా అంతటా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్య పట్టణాలు, ప్రధాన రహదారులపై...