శాంతినికేతన్ విద్యాలయానికి ‘ఈటీ టెక్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డుగర్వకారణం
కరస్పాండెంట్ మాలి పటేల్ ప్రభు. సంగారెడ్డి జిల్లా.డిసెంబర్ 13 మనప్రజాప్రతినిధి//సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన శాంతినికేతన్ విద్యాలయంకు ప్రతిష్టాత్మకమైన ‘ఈటీ టెక్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు’ లభించడం ఎంతో ఆనందకరమైన విషయమని పాఠశాల కరస్పాండెంట్ మాలి పటేల్ ప్రభు తెలిపారు.శనివారం రోజున హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ హాల్ నెంబర్–4లో ట్రస్మ ఆధ్వర్యంలో, కీర్తిశేషులు జి. పుల్లారెడ్డి గారి స్కూల్ ఫస్ట్ ఈటీటెక్ సంస్థ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును శాంతినికేతన్ విద్యాల యానికి ప్రదానం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్ పాఠశాలల కరస్పాండెంట్లకు ప్రోత్సాహం...