సిద్దిపేట జిల్లా, అక్బర్‌పేట-భూంపల్లి మండలం -ఈ రోజు భూంపల్లి గ్రామంలో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైలరింగ్ ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ.బక్కివెంకటయ్య-భాగ్యలక్ష్మి హాజరయ్యారు.చైర్మన్ వెంకటయ్య గారు మహిళలు అన్ని రంగాలలో ముందుకు రాణించాల్సిన అవసరం గురించి స్పష్టంగా చెప్పారు. ఈ శిక్షణ ద్వారా మహిళలకు స్వంత గ్రామంలోనే ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని, నలుగురికి శిక్షణ నేర్పించే విధంగా అవకాశాలు ఏర్పరచాలని సూచించారు.ఎర్త్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ట్రైలరింగ్ శిక్షణ మహిళల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు మించినదని, విద్యార్థుల జీవితాలకు ఉపయోగపడు తుందని తెలిపారు. కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసినవారికి పాల్గొన్న సర్టిఫికెట్లు, క్రమశిక్షణ, పట్టుదల ఆధారంగా మొదటి మరియు ద్వితీయ బహుమతులు అందజేయడం జరిగింది. అదనంగా, బక్కి భాగ్యమ్మ-వెంకటయ్య గారు కూడా శిక్షణ పొందిన మహిళలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.అలాగే, హై స్కూల్ విద్యార్థుల కోసం 200 మంది విద్యార్థులకు వాసన్ ఐ కేర్ మరియు Upgrade My Classroom సహకారంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, 6 మంది విద్యార్థులకు కళ్ళ జోడు ఇవ్వడం జరిగింది.ఈకార్యక్రమంలో నూతన గ్రామ సర్పంచ్ జిన్నా రెడ్డి, ఉపసర్పంచ్ అనూష నందం, వార్డు మెంబర్స్, ఎర్త్ ఫౌండేషన్ డైరెక్టర్ వెన్నెల, ఆంజనేయులు, నిహారిక, గ్రామస్తులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.