•సైబర్ ఆర్థిక నేరాలపై అవగాహన కార్యక్రమం
ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ
మెదక్ జిల్లా//రామయంపేట్ మండలం.ఝాన్సీ లింగాపూర్ | డిసెంబర్27
రామయంపేట్ మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం, వెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సైబర్ ఆర్థిక నేరాలు, మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు, బ్యాంకింగ్ లావాదేవీలలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వివరించారు.
అలాగే బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన వంటి ప్రభుత్వ బీమా పథకాల ప్రాధాన్యతను వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలలో నమోదు చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ నరేష్ మాట్లాడుతూ, “సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కాల్స్, లింక్స్, ఓటీపీలు పంచుకోకుండా జాగ్రత్త వహించాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామకిష్టయ్య గారు, ఉప సర్పంచ్ మహేష్ గారు, బ్యాంకు మిత్ర సౌందర్య గారు, కౌన్సిలర్లు నరేష్, వంశీతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.