manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 2:55 pm Posted by : Mana Praja Prathinidhi

యేసు ప్రభువు గొప్పతనం, సర్వమత సమానత్వమే క్రిస్మస్ సందేశం

చంద్రబాబు నాయుడు సర్వమతాలను గౌరవిస్తూ సమాన న్యాయం పాటించటంగొప్పవిషయం: కలెక్టర్ వెంకటేశ్వర్లు
మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా,డిసెంబర్23
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో యేసు ప్రభువు గొప్పతనం, ప్రేమ, త్యాగం, మానవత్వ సందేశాలను వక్తలు కొనియాడారు.సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యేసు ప్రభువు ప్రపంచానికి శాంతి, క్షమ, సౌభ్రాతృత్వాన్ని బోధించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమతో మెలగాలని ఆయన సందేశం నేటి సమాజానికి అత్యంత అవసరమన్నారు.అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని మతాలను సమానంగా గౌరవించే నాయకుడని, సర్వమత సమానత్వమే ప్రభుత్వ విధానమని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని మతాల పండుగలను ప్రభుత్వ స్థాయిలో నిర్వహిస్తూ ఐక్యతను బలోపేతం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే పులివర్తి నాని, పాస్టర్లు రెవరెండ్ సతీష్, మార్టిన్, అరుళ్ అరసు, వేదనాయకంతో పాటు జిల్లాలోని పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరసోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.