సదాశివపేట మండల కురుమ సర్పంచులు, వార్డు సభ్యులకు ఘన సత్కారం

సదాశివపేట,డిసెంబర్28(మనప్రజాప్రతినిధి):సదాశివపేట మండల కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వెల్టూరు గ్రామ శివారులోని పద్మావతి గార్డెన్‌లో నూతనంగా ఎన్నికైన కురుమ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు గూడెం మల్లయ్య, మండల కురుమ సంఘం అధ్యక్షులు శివలింగ నరసింహులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సదాశివపేట మండలంలో అధిక సంఖ్యలో కురుమ సర్పంచులు ఎన్నిక కావడం గర్వకారణమని పేర్కొంటూ, గెలిచిన ప్రతినిధులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో...