వర్షాలప్రభావంతోమేర్లపాకఅంగన్వాడీభవనంకూలిపోయిపెద్దప్రమాదంతప్పిందిగ్రామస్థులఆవేదన,కొత్తభవనంనిర్మించాలనిడిమాండ్
మనప్రజాప్రతినిధి,ఏర్పేడుమండలం.డిసెంబర్3ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామంలో భారీ వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో గ్రామంలోని పాత అంగన్వాడీ భవనం సోమవారం అకస్మాత్తుగా కూలిపోయింది. గత కొద్దిరోజులుగా గోడలు తడిసి బలహీనమైనా, వర్షం తీవ్రత పెరిగిన సమయంలో పూర్తిగా కూలిపోవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. అయితే ఆ సమయానికి భవనంలో అంగన్వాడీ పిల్లలు లేకపోవడం దేవుడి దయగా పెద్ద ప్రమాదం తప్పింది.అంగన్వాడీ ప్రాంగణంలో వర్షపు నీరు అధికంగా నిల్వ ఉండడం, భవనం చుట్టూ మట్టి మరింత సడలిపోవడం వంటి సమస్యలు ముందే గుర్తించిన నేపధ్యంలో గత వారం నుంచే...