•ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఘన ప్రారంభం
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్ 28
ఎర్పేడు మండలం వినాయకుడి గుడి సమీపంలో వన్నె రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పేడు మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యా లతో జీవించాలని భగవంతుని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వన్నె రెడ్డి సేవా సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు లాయర్ తిరుమల రెడ్డి, మాజీ సర్పంచ్‌లు సురేష్ బాబు, సదాశివ రెడ్డి, ఏర్పేడు మండల వైసీపీ ఉపాధ్యక్షులు మునికృష్ణ రెడ్డి, పాగాలి సర్పంచ్ రాజేశ్వరి, మాజీ ఎంపీటీసీ మునిరత్నం రెడ్డి, మాజీ సర్పంచ్ ముని రెడ్డి పాల్గొన్నారు.అలాగే సేవా సంఘం సోషల్ మీడియా అధ్యక్షులు కేశవులు రెడ్డి, పెంచల్ రెడ్డి, సీనియర్ నాయకులు దామోదర్ గెరటా రెడ్డి, జగదీష్, యువ నాయకులు వినోద్ రెడ్డి, గెరటా రెడ్డి, ముని రాం రెడ్డి, గణపతి రెడ్డి, మహిళా నాయకురాలు నాగమణి, మాధవ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.