మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్23
ఎర్పేడు మండలంలోని దేవాలయ వసతి గృహంలో నూతన పాలకమండలి సమావేశం అత్యంత ప్రాముఖ్యతతో నిర్వహించబడింది. ఈ సమావేశంలో భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి, పాలకమండలి సభ్యులు.చైర్మన్ ఏకగ్రీవంగా చారిత్రాత్మక తీర్మానాలు ఆమోదించారు.రాబోయే నూతన సంవత్సరం ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించగా, సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పాలకమండలి స్పష్టంగా ప్రకటించింది.మాస ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి వస్త్ర సేవ, అభిషేక అలంకరణ (పట్టు వస్త్రాలు భక్తులే తీసుకురావాలి) నిర్వహించేందుకు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు చైర్మన్ బత్తల గిరినాయుడు నేతృత్వంలో పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.అలాగే, ఆరుద్ర నక్షత్రం రోజున నటరాజు స్వామివారికి అభిషేకం చేసి ప్రాకారోత్సవం నిర్వహించేందుకు కూడా ఎమ్మెల్యే సూచనలతో పాలకమండలి తీర్మానం చేసింది.
ఇకపై ప్రతిరోజూ ప్రదోషకాలంలో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపు తప్పనిసరిగా అభిషేకం నిర్వహించాలనే నిర్ణయం తీసుకొని, భక్తులకు నియమబద్ధమైన పూజా విధానం అందించనున్నట్లు పాలకమండలి స్పష్టం చేసింది.
ఈ సమావేశంలో
పాలకమండలి చైర్మన్: బత్తల గిరిబాబు (గిరినాయుడు)
సభ్యులు: టి. బాబు, పి. అరుణ, టి. హంస, జి. గీత, బి. రాజ్‌కుమార్, టి. రేవతి, ఏ. ఉష, ఆర్. కిరణ్ కుమార్, కె. నిరంజన్
తదితరులు పాల్గొన్నారు.