manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 9:33 am Posted by : Mana Praja Prathinidhi

చంద్రగిరి గ్రామ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

బీసీనేత,మాజీసర్పంచ్ పొలాస నరేందర్ చేత శాలువాలతో ఘనసన్మానం
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 22
గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు వేగవంతంగా కల్పించేందుకు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని బీసీ నేత, మాజీ సర్పంచ్ పొలాస నరేందర్ అన్నారు.వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీమతి ముత్త సంజన మహేష్, ఉపసర్పంచ్ శ్రీ ఈర్నాల రాజు తో పాటు పలువురు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పొలాస నరేందర్ నూతన పాలకవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ సర్పంచులు వెంకట్ గౌడ్, ఏడెళ్లి మల్లయ్యలతో పాటు ధమ్మ భాస్కర్, న్యాత నర్సయ్య, పల్కం లక్ష్మీ రాజం, ముత్త ఎల్లయ్య, ముత్త మోహన్, బూర రాములు, చర్ల శ్రీనివాస్, హన్మంతు, నరేష్, సంజీవ్, అమిత్ తదితరులు పాల్గొన్నారు.