మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం.దుబ్బాకనియోజకవర్గం సిద్దిపేటజిల్లాడిసెంబర్23
అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం ఘనంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన నీలం ప్రభాకర్ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టగా, ఉపసర్పంచ్‌గా పాతూరి నవీన్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జి. నాగరాజు, జి. యాదగిరి, బి. అంజయ్య, బి. ఎల్లం, జి. శృతి, యం. మారుతీ, వి. సత్తమ్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ నీలం ప్రభాకర్ మాట్లాడుతూ,
“గ్రామస్తుల సహకారంతో తాళ్లపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. అందరం కలిసి పనిచేస్తూ అక్బర్‌పేట్ భూంపల్లి మండలంలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు.
గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, పారదర్శక పాలనతో ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తాళ్లపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజల మద్దతు అత్యవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూతన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.