manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 3:05 pm Editor : Mana Praja Prathinidhi

మండలంలోని 16 గ్రామాల్లో నూతన పాలకవర్గం ఘన ప్రారంభం

గ్రామాల్లో సర్పంచుల ప్రమాణ స్వీకారంఅభివృద్ధి పనులు షురూ
మెదక్.మనప్రజాప్రతినిధి//డిసెంబర్22
అలాదుర్గం మండలంలోని 16 గ్రామపంచాయతీలకు నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. సోమవారం మండల పరిధిలోని 16 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.ముస్లాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన సర్పంచ్‌తో పాటు పాలకవర్గం ప్రమాణ స్వీకారాన్ని స్పెషల్ ఆఫీసర్ రమేష్ నిర్వహించారు. ముందుగా సర్పంచ్ పడిగే జ్యోతి, ఉప సర్పంచ్ రమేష్ ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం వార్డు సభ్యులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించి, గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని అధికారులు సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక పాలన అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజ్‌తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.