•వెలవేళబోయినగ్రామపంచాయతీలకు సరికొత్త జీవం
గ్రామాల్లోమళ్లీప్రజాస్వామ్యవెలుగులు•నిబద్ధతతో పనిచేస్తామని హామీఇచ్చిననూతనపాలకవర్గం•ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడంతో గ్రామంలో పండుగ వాతావరణం•ఇరుకోడు ప్రమాణ స్వీకారంలో మారెడ్డిరవీందర్ రెడ్డి పిలుపు•ప్రజల ఆశలతో ప్రమాణ స్వీకరించిన సర్పంచ్, వార్డు సభ్యులు
మనప్రజాప్రతినిధి | సిద్దిపేట నియోజకవర్గం
డిసెంబర్ 22
సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఘనపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.ఎన్నాళ్లుగానో ఎన్నికైన పాలన లేక నిర్జీవంగా మారిన గ్రామపంచాయతీలకు నేడు సరికొత్త జీవం వచ్చింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించడంతో గ్రామాల్లో మళ్లీ ప్రజాస్వామ్య వెలుగులు విరాజిల్లాయి.నిర్జీవంగా కనిపించిన గ్రామపంచాయతీ కార్యాలయాలు నేడు పండుగ వాతావరణాన్ని తలపిస్తూ జెండాలు, తోరణాలు, పూల అలంకరణలతో కళకళలాడాయి. ప్రజల నమ్మకమే పునాదిగా, ప్రజాస్వామ్యమే శక్తిగా నిలిచే గ్రామపంచాయతీ వ్యవస్థకు మళ్లీ గౌరవం దక్కిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.గ్రామాభివృద్ధికి నడికట్టు బిగించాలనే సంకల్పంతో నూతన ప్రజాప్రతినిధులు ముందుకు రావడంతో గ్రామాల్లో ఆశలు చిగురించాయి. ప్రజల గొంతుకకు నిలయమైన గ్రామపంచాయతీ ఇకపై సమస్యల పరిష్కారానికి కేంద్రబిందువుగా మారనుందన్న విశ్వాసం గ్రామస్తుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.గత 690 రోజులుగా, దాదాపు రెండు సంవత్సరాల పాటు ఎన్నికైన పాలన లేకపోవడంతో గ్రామపంచాయతీలు అధికారుల సేవలకే పరిమితమయ్యాయి. ఫలితంగా అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నేడు నూతన పాలకవర్గాల రాకతో, ప్రమాణ స్వీకార కార్యక్రమాలతో ఎండిన మొక్కలకు చిగురు వచ్చినట్టుగా, వడిసిన నేలపై వాన పడినట్టుగా గ్రామపంచాయతీల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ మాజీ సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ,“గ్రామపంచాయతీ ప్రజాస్వామ్యానికి పునాది. గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ప్రజలిచ్చిన ఈ పవిత్ర బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, అవినీతికి తావులేకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. యువత నాయకత్వంలో గ్రామాలకు స్వర్ణభవిష్యత్తు సిద్ధమవుతుంది” అని పిలుపునిచ్చారు.ఆయన ప్రసంగం గ్రామస్తుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి, నూతన పాలకవర్గానికి దిశానిర్దేశం చేసింది.పెండింగ్ బిల్లుల పరిష్కారం, గ్రామపంచాయతీ నిధుల సక్రమ వినియోగం, అభివృద్ధి పనుల్లో పారదర్శకత పాటించాలని ప్రజలు కోరుతున్నారు. గెలిచామన్న గర్వం లేకుండా, ఓడిపోయామన్న శత్రుత్వానికి తావులేకుండా, అవకతవకలు చోటుచేసుకోకుండా నిబద్ధతతో పనిచేయాలని నూతన వార్డు మెంబెర్స్.1వ.బొప్పిడిరాజవ్వ 2.గోపాలఎల్లవ్వ 3.బండిబాలవ్వ 4. బాలగోనిస్రవంతి 5.బందారంపర్శరాములు6.వాసూరిశేఖర్ 7.గణపురంరమేష్8.కత్తిశ్రీనివాస్ గౌడ్.9.బొర్రచంద్రశేఖర్ 10.సాహెదబేగం పాలకవర్గానికి హితవు పలికారు. రాబోయే ఐదేళ్లకే కాకుండా, రాబోయే ఐదు తరాలకు మార్గదర్శకంగా నిలిచేలా పాలన సాగించాలని ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేశారు.తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామపంచాయతీ సమావేశాల నిర్వహణ, నిధుల వినియోగంపై పర్యవేక్షణ, రోడ్లు–డ్రైన్లు, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, గ్రామస్తుల సమస్యల పరిష్కారం వంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని గ్రామస్తులు గుర్తు చేశారు.ప్రస్తుత పాలకవర్గంలో సుమారు 60 శాతం యువత ఉండటం గ్రామాలకు మరింత ఆశాజనకంగా మారింది. యువత నాయకత్వంలో గ్రామాలకు మంచి భవితవ్యం సిద్ధమవుతుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.ఈ కార్యక్రమంలో చిట్యాల సత్యనారాయణ గౌడ్, బొర్ర రాజాబాబు, మాజీ ఉపసర్పంచ్ వాసూరి స్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు మారెడ్డి మధుసూదన్ రెడ్డి, మారెడ్డి లింగారెడ్డి, మారెడ్డి రాంలింగారెడ్డి. మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి. పంచాయతీ కార్యదర్శికిషన్ రావు, పంచాయతీ కారోబారి సాప ఎల్లం. ఫీల్డ్ అసిస్టెంట్ మారెడ్డి మధుసూదన్ రెడ్డి. గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నూతనంగా ఎన్నికైన పాలకవర్గం గ్రామపంచాయతీ పట్టు పగ్గాలు స్వీకరించడంతో గ్రామాల్లో మళ్లీ ప్రజాస్వామ్య పాలనకు బంగారు బాటలు పడుతున్నాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.