మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్25
కొండపాక మండలంలోని బందారం గ్రామ నూతన సర్పంచ్ గంగాధర్ బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాభివృద్ధికి సంబంధించి పలు అంశాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగాధర్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, సర్పంచ్‌గా బాధ్యతలుస్వీకరించినందుకు అభినందించారు.
అనంతరం నూతన సర్పంచ్ గంగాధర్ మంత్రిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.పొన్నం ప్రభాకర్ గంగాధర్ తో ప్రజలు మెచ్చే పరిపాలన జరపాలని హితం పలికాడు.