manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 5:52 am Posted by : Mana Praja Prathinidhi

ఎర్పేడు గ్రామంలో ఘనంగా ఓం శక్తి మాలధారణ ఇరుముడి కార్యక్రమం

తిరుపతిజిల్లా.డిసెంబర్23(మనప్రజాప్రతినిధి)
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఏర్పేడు గ్రామంలో ఓం శక్తి మాలధారణ వేసుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో ఇరుముడి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధికి బయలుదేరే సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా, అవి ప్రజలను ఆకట్టుకున్నాయి. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికీ అమ్మవారి కృప కలగాలని, గ్రామం సుభిక్షంగా, శాంతియుతంగా ఉండాలని గ్రామ దేవతను భక్తితో వేడుకున్నారు.ఇరుముడి కార్యక్రమం ముగిసిన అనంతరం ఓం శక్తి మాలధారణ ధరించిన భక్తులు మేలు మరువత్తూర్ అమ్మవారి దర్శనార్థం బయలుదేరారు. ఈ కార్యక్రమాలను ఓం శక్తి గురువుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.