manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 6:23 pm Editor : Mana Praja Prathinidhi

నా గ్రామ ప్రజలే నా బలం, నా బలగం

లేడీ పర్స్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి.మామిడి యాదగిరి గౌడ్ పిలుపు
మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్12
వెంకటాపూర్, కొంటూరు మరియు తాండవాసుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి మామిడి యాదగిరి గౌడ్ హామీ ఇచ్చారు.మండల కేంద్రం మెదక్‌లో సర్పంచ్ అభ్యర్థిత్వం దాఖలు చేసిన అనంతరం, ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు.“ఒకసారి గెలిపించి చూడండి అభివృద్ధి ఏంటో చూపిస్తా.వెంకటాపూర్‌ను, కొంటూరును నిజమైన అభివృద్ధి దిశగా నడిపిస్తా” అని యాదగిరి గౌడ్ తెలిపారు.ప్రధాన హామీలుగ్రామాలకు శుద్ధి నీటి సౌకర్యంప్రతి వీధిలో ఎల్ఈడి వీధి దీపాలుసిసి రోడ్లు, కాలువలు, మౌలిక వసతుల అభివృద్ధిప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరేలా నడపడం“మీ అమూల్యమైన ఓటే నాకు బలం. లేడీ పర్స్ గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించండి. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి కుటుంబానికి అందుబాటు లో ఉంటూ, మీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను” అని ఆయన అన్నారు.అలాగేకొంటూరు – మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరుస్తామని, వాటిని గ్రామ అభివృద్ధి దిశగా సమర్థవంతంగా వినియో గిస్తామని యాదగిరి గౌడ్ తెలిపారు.“ప్రతి ఒక్కరు తమ అమూల్య మైన ఓటును లేడీ పర్స్ గుర్తుకు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిం చండి. మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను” అని ఆయన గ్రామ ప్రజల ను కోరారు.