మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా,డిసెంబర్11శివాయిపల్లి గ్రామ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని గ్రామ ప్రజలను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాసా వెంకటి కోరారు. శివాయిపల్లి గ్రామ ప్రజలే తన బలం, తన బలగమని, తమ ఆశీస్సులు తనకు విజయం కావొచ్చని భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీలో గెలిపించా లని ప్రజలను కోరారు.గ్రామంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడు తూ…“నన్ను నమ్మి గెలిపిస్తామన్న మాట ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. శివాయిపల్లిని అభివృద్ధి చేసి చూపిస్తా. పగలు–రాత్రి తేడా లేకుండా కష్టపడి పని చేస్తాను. కాంగ్రెస్‌తోనే గ్రామానికి నిజమైన అభివృద్ధి సాధ్యం” అని చెప్పారు.“నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు నిజమైన సేవ చేస్తాను. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఇంటికీ చేరుకుంటాను. మీ ప్రేమ కు,మీ నమ్మకానికి రుణపడి ఉంటాను” అని కాసా వెంకటి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.