manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 2:50 pm Editor : Mana Praja Prathinidhi

ప్రజల నమ్మకమే నా బలం-మార్పడగ నూతన సర్పంచ్ ఆకారం బాలరాజ్

గ్రామ సేవకుడిగా పనిచేస్తా-సర్పంచ్ ఆకారం బాలరాజ్
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్22
కొండపాక మండలంలోని మర్పడగ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా ఆకారం బాలరాజ్ సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ సేవకుడిగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆకారం బాలరాజ్, రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, తాగునీరు, రహదారులు, విద్య, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక దృష్టి సారించి మార్పడగ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌గా బర్ల సంతోష్,వార్డు సభ్యులుగా దున్న పూర్ణచందర్, ఆకారం శివ, పాల్లిపట హరిబాబు, జంగం పల్లి పుష్పలత, లాజిషెటి రాజేశం, కొండూరు పద్మ, ఆకారం భాగ్య, బర్ల భూలక్ష్మి, ఊళ్ళగల రాములు, కోటగాళ్ల భవాని, సున్నం సాయి లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులకు అభినందనలు తెలియజేశారు. గ్రామంలో అభివృద్ధి వేగవంతం కావాలని ఆకాంక్షించారు.