ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజాపాలనకు శ్రీకారం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నయువసర్పంచ్ నాయినినవీన్ కుమార్మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్19ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామంలో యువ సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ ప్రజల నమ్మకాన్ని పనుల ద్వారా నిలబెట్టుకున్నారు. అధికారికంగా బాధ్యతలు చేపట్టకముందే గ్రామాభివృద్ధికి చర్యలు ప్రారంభించి, మాటకంటే పని ముఖ్యమని నిరూపించారు. ఏళ్ల తరబడి తాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్న 1, 2, 8, 10వ వార్డుల ప్రజలకు తక్షణ పరిష్కారం చూపుతూ కొత్త మోటార్లు, షాటర్లు ఏర్పాటు చేయించారు. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంచి నీటి సమస్యకు పూర్తిస్థాయి ఉపశమనం లభించింది.గ్రామ ప్రజల కష్టాలను స్వయంగా...