•సోమవారం ప్రజావాణికి బ్రేక్ – కలెక్టర్ గరిమ అగ్రవాల్ •ప్రకటనజిల్లాలో రేపు ప్రజావాణి లేదు-అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నం.
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్21
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో రేపు (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు.రెండో దశ సాధారణ పంచాయతీ ఎన్నికలు – 2025లో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈ నెల 22వ తేదీన (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, జిల్లా అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటుందని ఆమె పేర్కొన్నారు.ఈ కారణంగా రేపటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఇంచార్జి కలెక్టర్ కోరారు.