manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 11:53 am Editor : Mana Praja Prathinidhi

నచ్చనేరి గ్రామంలో రీ-సర్వే పైలెట్ ప్రాజెక్ట్‌కు విశేష స్పందన

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.ఏర్పేడు మండలండిసెంబర్ 26
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని నచ్చనేరి గ్రామంలో ఈరోజు నిర్వహించిన రీ-సర్వే కార్యక్రమంను పైలెట్ ప్రాజెక్ట్‌గా డిప్యూటీ తాసిల్దార్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన చేయడంలో విజయవంతగా రీ సర్వే గురించి పూర్తి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామంలోని రైతులంతా ఏకగ్రీవంగా పాల్గొని పూర్తి సహకారం అందించడంతో రీ-సర్వే ప్రక్రియ కార్యక్రమం సాఫీగా, పారదర్శకంగా కొనసాగింది.రీ-సర్వే సందర్భంగా భూమి హద్దులు, విస్తీర్ణం, రికార్డుల సరిపోలిక వంటి అంశాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. భూమి హక్కుల విషయంలో ఎలాంటి అనుమానాలు లేకుండా బాధ్యతాయుతంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు / కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
రైతుల భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన ఈ రీ-సర్వే పైలెట్ ప్రాజెక్ట్‌ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది.గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలు మరింత మెరుగుపడేలా ఈ కార్యక్రమం మైలురాయిగా మారనుంది.