manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 3:39 pm Editor : Mana Praja Prathinidhi

అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద కుటుంబానికి అండగా సర్పంచ్

•మృతుడికుటుంబానికిరూ.5వేలఆర్థికసహాయం
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్24
కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పిట్ల సత్తయ్య బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన సత్తయ్య మృతి విషయం గ్రామ ప్రజలు సర్పంచ్ కరుణాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, మృతుడి అంతక్రియలకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామస్తులతో కలిసి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ,నిరుపేదకుటుంబాలకుగ్రామపంచాయతీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.ఆర్థిక సహాయం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు సర్పంచ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.