భూంపల్లి అభివృద్ధికి కత్తెర గుర్తే మార్గంసర్పంచ్ అభ్యర్థి ఎల్లన్నగారి వంశీ రెడ్డి ప్రజల చేతినిండా ఆశీర్వాదం కోరుతూ ప్రచారంవేగం
మనప్రజాప్రతినిధి//అక్బర్పేట–భూంపల్లి దుబ్బాకనియోజకవర్గం.సిద్దిపేటజిల్లాడిసెంబర్ 11అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లన్నగారి వంశీ రెడ్డి గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలను పలకరిస్తూ, తమకు లభించిన ఆదరణపై సంతోషం వ్యక్తం చేశారు.వంశీ రెడ్డి మాట్లాడుతూ“నేను పదవి కోసం కాదు… సేవ కోసం ముందుకొస్తున్నాను.భూంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం నా ఒకే లక్ష్యం. గ్రామాభివృద్ధిలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటాను. మీ అందరి శ్రేయస్సే నా ధ్యేయం,” అని తెలిపారు.అధికార...