సిద్దిపేట జిల్లాలో గ్రామపంచాయతీ 2వ విడత పోలింగ్ 14న

12న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార నిషేధం – మద్యం దుకాణాలు సీజ్ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ కే.హైమావతి హెచ్చరిక సిద్దిపేటజిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్11.సిద్దిపేట జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఈ నెల 14వ తేదీ ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు జరుగనున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పోలింగ్‌కు సంబంధించిన అక్బర్పేట్ భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక. మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట్,...